18, నవంబర్ 2016, శుక్రవారం

Telugu Samaacharam

Telugu Talli

తెలుగు సామెతలు(PROVERBS)

1వ భాగం (100సామెతలు)

పది మంది జీవితానుభవాల సమీకరణమే సమెత, ఇవి నీతిని, హాస్యాన్ని, ఆనందాన్ని అందిస్తాయి. అభిప్రాయ వ్యక్తీకరణాన్ని వక్రగతి నుండి కాపాడ టానికి ఈ సామెతలు సహాయపడతాయి. 
           సామెతలు రచనకు, ప్రసంగానికి దీపాలు. సమయోచితంగా ఒక సామెతను ప్రయోగిస్తే పాలలో పంచదార కలిసినట్లే. సామెతలు చిన్న చిన్న వాక్యాలుగా ఉంటాయి. చెవికి ఇంపుగా ఉంటాయి. మన పూర్వుల అనుభవాన్ని తెలియజేసే అమృత గుళికలు సామెతలు. సూటిగా చెప్పాలనుకున్న విషయవివరణకు సహకరి సామెత.
1. కోటి విద్యలు కూటి కొరకే 
2. ఒక పూట తినేవాడు యోగి, రెండు పూటలా తినేవాడు భోగి, మూడు పూటలా తినేవాడు రోగి. 
3. పెండ్లి అయిన మొదటి ఆరు నెలలు భర్త మాట భార్య వింటుంది. తరువాతి ఆరు నెలలు భార్య మాట భర్త వింటాడు. ఆ తరువాత వారిద్దరి మాటలు ఇరుగు పొరుగు వారు వింటారు. 
4. వాస్తు అంటే పడగొట్టే శాస్త్రం - ఇంజనీరింగ్ అంటే కట్టే శాస్త్రం. 
5. మంత్రాలకు చింతకాయలు రాలునా ?.. అంత్రాలకు జబ్బులు తగ్గునా?
6. జలుబు చేస్తే మందులు వాడితే వారం రోజులలో తగ్గుతుంది. మందులు వాడకపోతే ఏడు రోజులలో తగ్గుతుంది. 
7. స్నేహితునికి డబ్బులు ఇస్తే రెండూ పోతాయి.
8. అమ్మను మించిన దైవము లేదు. 
9. అత్తా ఒకింటి కోడలే. 
10. అంగట్లో అన్నీ ఉన్నవి. అల్లుడి నోట్లో శని ఉన్నది. 
11. అడిగితేగాని అమ్మ ఐనా అన్నం పెట్టదు. 
12. అత్త చచ్చిన ఆరు నెలలకు కోడలు వచ్చింది. 
13. అమ్మ పుట్టిల్లు మేనమామ దగ్గరా. 
14. అమ్మ పెట్టాపెట్టదు, అడుక్కు తిననివ్వదు. 
15. అలివిగాని అలిని కట్టుకొని మురిగిచచ్చేరాముండాకొడుకు. 
16. అడ్డాలనాడు బిడ్డలుగాని, గడ్డాలనాడు బిడ్డలా. 
17. అబ్బ బావి తవ్విస్తే, అబ్బాయి పూడ్పించాడట. 
18. అంత్య నిష్ఠురం కన్నా అది నిష్టురమే మేలు. 
19.అలిగే బిడ్డతో చెలిగే గొడ్డుతో వేగడం కష్టం. 
20. అవ్వా కావలెను బువ్వా కావలెను. 
21. అమ్మ గృహ ప్రవేశము, ఆయ్య స్మశాన ప్రవేశము. 
22. అండలేని ఊళ్ళో ఉండదోషం. ఆశ లేని పుట్టింట  అడగదోషం. 
23. అడవి కాచిన వెన్నెల. 
24. అడ్డకత్తెరలో పోకచెక్కలాగా. 
25. అడిగేవాడికి చెప్పేవాడు లోకువ. 
26. అంధునికి అద్దము చూపినట్లు. 
27. అంబలి తాగే  వానికి మీసాలు ఎగబెట్టేవారు కొందరా. 
28. అమ్మబోతే అడవి - కొనబోతే కొరివి. 
29. అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినట్లు. 
30. అన్నము పెడితే తిరిగిపోతుంది. చీర ఇస్తే చిరిగిపోతుంది. వాత పెడితే కలకాలం ఉంటుంది. 
31. అప్పు ఇచ్చినవాడు బాగు కోరును. తీసుకున్నవాడు చెడు  కోరును. 
32. అగ్నికి వాయువు తోడైనట్లు. 
33. అగ్నిలో ఆజ్యం పోసినట్లు. 
34. అల్పుడికి ఐస్వర్యము వస్తే అర్ధరాత్రివేళ గొడుగుపట్టమన్నాడట. 
35. అడుసు త్రొక్కనేల కాలు కడగనేల. 
36. ఆయ్యవారిని చేయబోతే కోతి అయినది. 
37. అందని ద్రాక్షపండ్లు పుల్లన. 
38. అందని మామిడిపండ్లుకు ఆశ పడ్డట్టు. 
39. అన్నం ఉడికిందో లేదో అంతా పట్టి చూడనక్కర లేదు. 
40. అరచే కుక్క కరవదు. 
41. అందితే జుట్టు అందకపొతే కళ్ళు. 
42. అర్ధరాత్రివేళ అంకమ్మ శివాళ్ళు అన్నట్లు. 
43. అంతా తెలిసినవారు లేరు - ఏమి యెరుగనివారు లేరు. 
44. అవివేకితో స్నేహం కన్నా - విరోధితో విరోధం మేలు. 
45. అరువు సొమ్ము బరువు చేటు. 
46. ఆలికిన ఇంట ఒలికినా ఆనందమే. 
47. అరిటాకు వచ్చి ముళ్ళు మీద పడ్డా - ముళ్ళువచ్చి అరిటాకు మీదపడ్డా అరిటాకుకే నష్టం. 
48. అశుద్ధం మీద రాయి వేస్తే ముఖాన పడుతుంది. 
49. అందరికీ శకునము చెప్పే బల్లి కుడితి తొట్టిలో పడ్డట్టు. 
50. అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు. 
51. అన్నీ ఉన్న ఆకు అణిగిపది ఉంటుంది. ఏమీలేని ఆకు ఎగిరెగిరి పడుతుంది. 
52. అడిగోపులి అంటే ఇదిగో తోక అన్నట్లు. 
53. అట్టపెట్టే ఆరళ్ళే కనపడతాయిగాని, కోడళ్ళు చేసే కొంటె పనులు కనపడవు. 
54. అనగా అనగా రాగం తినగా తినగా రోగం. 
55. అన్నం తిన్న వాడు తన్నులు తిన్నవాడు మరచి పోడు. 
56. అర్జీల వల్ల పనులు కావు, ఆశీర్వాదాలు వల్ల బిడ్డలు పుట్టరు. 
57. అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్లు. 
58. అంతా మనమంచికే. 
59. అండలుంటే కొండలు దాటవచ్చు. 
60. అందరూ వైష్ణవులైతే బుట్టెడు రొయ్యలు ఏమైనట్లు. 
61. అచ్చుబోసిన ఆంబోతులాగా. 
62. అప్పుచేసి పప్పుకూడు. 
63. అయిపోయిన పెళ్ళికి మేళమెందుకు. 
64. అర్ధరాత్రి వేళ మద్దెల దరువు. 
65. అల్లుడికి బెట్టు ఇల్లాలికి గుట్టు ఉండాలి. 
66. అప్పులేనివాడు అధిక సంపన్నుడు. 
67. ఆలికి అన్నం పెట్టడం ఊరికి ఉపకారమా. 
68. ఆరోగ్యమే మహాభాగ్యం. 
69. అస్థికన్నా ఆరోగ్యం మిన్న.
70. ఆడలేక మద్దెల ఓడు అన్నట్లు. 
71. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా. 
72. ఆరు నెలలు స్నేహం చేస్తే వారు వీరవుతారు. 
73. ఆడబోయిన తీర్ధము యెదురుగా వచ్చింది. 
74. ఆలూలేదు చూలులేదు కొడుకు పేరు సోమలింగం. 
75. ఆకలి రుచి ఎరుగదు. నిద్ర సుఖం ఎరుగదు. వలపు సిగ్గు ఎరుగదు. 
76. ఆలుమగలు నందు పోట్లాట అద్దము మీద పెసరగింజ వేసినంత సేపు. 
77. ఆశపడి ఆరు లంఖణాలు చేస్తే ఆవేళా జొన్నకూడే . 
78. ఆడదిగా పుట్టేకంటే అడవిలో మానుగా పుట్టడం మేలు. 
79. ఆలు ఏడ్చిన ఇల్లు, ఎద్దు ఏడ్చిన సేద్యం ముందుకు రావట. 
80. ఆరు నెలలు చస్తాడనగా అసలు గుణం మారుతుందట. 
81. ఆయాసం ఒకరిది - అనుభవం మరొకరిది. 
82. ఆతండ్రి కొడుకు కూడా. 
83. ఆర్చేవారు లేరు తీర్చేవారు లేరు అడుగునబడితే లేవదీసేవారులేరు. 
84. ఆయుష్షు గట్టిదైతే అడవిలో ఉన్నా అయోధ్యలో ఉన్న ఒకటే. 
85. ఆఊరికి ఈఊరు యెంత దూరమో  ఈ ఊరికి ఆ ఊరు అంతే దూరం. 
86. ఆయుష్షు తీరినవాడు ఆరు నెలలకు చస్తే అనుమానం పడేవాడు అప్పుడే చచ్చాడంట. 
87. ఆరు నూరిన అదంటే. 
88. ఆరంభ సూరుడికి ఆర్భాటాలు ఎక్కువ. 
89. ఆవలిస్తే పేగులు లెక్కపెట్టినట్లు. 
90. ఆలస్యం చేస్తే అమృతం విషమౌతుందట. 
91. ఆరుద్ర వర్షం అమృతంతో సమానం. 
92. అడే కాలు పాడే నోరు ఊరకుండవట. 
93. ఆలు గుణవంతురాలైతే మేలు కలుగును. 
94. ఇంటికి దీపం ఇల్లాలే. 
95. ఇళ్లునుచూచి ఇల్లాలిని చూడమన్నారు. 
96. ఇల్లు చుస్తే తెలుస్తుంది ఇల్లాలి అందం. 
97. ఇల్లు ఇర్కటం ఆలు మర్కటం. 
98. ఇంట్లో పిల్లలు మంచంలో నల్లులు. 
99. ఇద్దరు పెళ్ళాల మొగుడు ఇరుకునపడి చచ్చినట్టు. 
100. ఇంటగెలిచి రచ్చ గెలవమన్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి