21, నవంబర్ 2016, సోమవారం

Telugu samacharam1

తెలుగు సామెతలు (PROVERBS)
 పార్ట్-2(100సామెతలు)

101. ఇంట గెలిచి రచ్చ గెలవమన్నారు. 
తెలుగు తల్లి
102. ఇల్లు పీకి పందిరి  పందిరివేసినట్లు. 
103. ఇంటిదానికి ఇత్తడి గొలుసు బజారు దానికి బంగారు గొలుసు. 
104. ఇంట్లో ఈగలమోత - బయట పల్లకి మోత. 
105.ఇల్లు అలకగానే పండుగ అవుతుందా. 
106. ఇంటి పేరు కస్తూరి వారు ఇంట్లో గబ్బిలాల కంపు. 
107. ఇంటికన్నా గుడి పదిలం. 
108. ఇంటి దీపం అని ముద్దు పెట్టుకుంటే మూతి మీసాలన్నీ తెగ కాలినాయట. 
109. ఇచ్చే వాన్ని చూస్తే చచ్చేవాడైనా లేస్తాడట. 
110. ఇచ్చేవానికి పత్రము వద్దు, చచ్చేవానికి మందూ వద్దు. 
111. ఇసుక తక్కిడ పేద తక్కిడ. 
112. ఇత్తు ఒకటి వేస్తే చెట్టొకటి మొలుస్తుందా. 
113. ఇచ్చేవాడు దాత ఇవ్వనివాడు రోత. 
114. ఇచ్చింది ఇచ్చి పుచ్చింది కొన్నాట్ట. 
115. ఇవ్వాల ఛస్తే రేపటికి రెండు. 
116. ఇల్లలికితే పండుగవుతుందా - తోరణం కడితే పెళ్లవుతుందా. 
117.ఇల్లు కాలిపోతుంది ఈర్రాజు అంటే నాదేం పోతుంది నరసరాజు అన్నాట్ట.
118. ఈ ఇంటి కాకి ఆ ఇంటి మీద వాలదు.
119. ఈతకు మించిన లోతు, గోచీకి మించిన దరిద్రము లేదు.
120. ఈనగాచి నక్కలా పాల్జేసినట్లు.
121. ఈత చెట్టు క్రింద నిల్చొని పాలు త్రాగినా కల్లే అంటారు.
122. ఈడ్పు కాళ్ళ వాడికి ఇద్దరు భార్యలు ఒకటి ఈడువ ఒకటి ఏడువ.
123. ఈనెలలో వడ్డీ లేదు వచ్చే నెలలో అసలు లేదు.
124. ఈడు చూసి పిల్లనివ్వు, పిడి చూసి కొడవలివ్వు.
125. ఈత వచ్చిన వాడికి లోతులేదు.
126. ఈ కంటికి రెప్పలద్దామా.
127. ఈత గింజ ఇచ్చి తాటిగింజ లాగేవాడు.
128. ఉన్న ఊరు కన్న తల్లి లాంటిది.
129. ఉచ్చ గుంటలో చేపలు పట్టినట్లు.
130. ఉల్లి పది తలలు పెట్టు.
131. ఉల్లి మల్లి కాదు వుంచుకున్నది పెల్లముకాదు.
132. ఉద్యోగం పురుష లక్షణం ఆగిపోతే అవలక్షణం.
133. ఉడుతాభక్తి.
134. ఉన్నమాటంటే ఉలుకెందుకు.
135. ఉయ్యాల్లో పాపాయిని పెట్టుకొని ఊరంతా వెదికినట్లు.
136. ఉద్యోగం పురుష లక్షణం అదిపోతే అవలక్షణం.
137. ఉంగరాల చేత్తో మొటైతే నొప్పి ఉండదు.
138. ఉరుకు ఉరకమనే సవితే గాని, తోడు ఉరికే సవితి ఒక తెయన్నలేదు.
139. ఉప్పుతో ముప్పైఆరు ఉంటే, ఉత్తముండైనా వండుతుంది.
140. ఊపిరి ఉంటే ఉప్పు అమ్ముకొని బ్రతకవచ్చు.
141. ఊరక రారు మహాత్ములు.
142. ఊరందరిదీ ఒక దోవ, ఉలిపి కట్టెకు ఒక్కదోవ.
143. ఊరు పొమ్మంటుంది కాడు రమ్మంటుంది.
144. ఊళ్ళో పెళ్ళికి కుక్కల హడావిడిలాగా.
145. ఊరినిండా అప్పులు, తలనిండా బొప్పులు.
146. ఊరికళ మొండి గోడలు చెబుతాయి.
147. ఊల్లో బియ్యం కయ్యాలపాలు.
148. ఊసరవెల్లిలా రంగులు మార్చేవారు.
149. ఊరముందరి చేను కాకుల పాలు.
150. ఊళ్ళో అధికారమైనా ఉండాలి ఊరంచున పొలమైనా ఉండాలి
151. ఋణశేషమ, వ్రణశేషము, అగ్ని శేషము ఉంచరాదు.
152. ఋషిమూలం, నదీమూలం, స్త్రీమూలం విచారించరాదు.
153. ఎంగిలి చేత్తో కాకికైనా మెడకు విదల్పడు.
154. ఎద్దు ఎండక లాగ దున్నపోతు నీడకులాగ.
155. ఎద్దుపుండు కాకికి ముద్దా.
153. ఎద్దు ఈనినందంటే కొట్టాన కట్టమన్నట్టు.
154. ఎనబోతు మీద వాన పడ్డట్టు.
155. ఎలుకకు పిల్లి సాక్ష్యం.
156. ఎక్కిరించబొయి వెల్లకిలా పడ్డట్టు.
157. ఎలుక మీద కోపాన యింటికి చిచ్చు పెట్టుకున్నట్లు.
158. ఎవరికి వారే ఏమునాతీరే.
159. ఎవరి ప్రాణము వారికే  తీపి.
160.ఎవడు తవ్వుకున్న గోతిలో వాడే పడతాడట.
161. ఎవరి కంపు వాడికింపు.
162. ఎంత పెరిగినా గొర్రెకు బెత్తెడే తోక.
163. ఎంతలావు మొగుడైనా ఆడదానికి లోకువే.
164. ఎంతవరాలిన కాంత దాసులే.
165. ఎంత చెట్టుకు అంతే గాలి.
166. ఎంగిలి ఎగ్గూ లేదు, తాగుబోతుకు సిగ్గూ లేదు.
167. ఎడ్డెమంటే తెడ్డెమన్నట్టు.
168. ఏరాయి అయితేనేం  పండ్లు ఊడగొట్టుకోవడానికి.
169. ఏఎండకు గొడుగు పట్టినట్లు.
170. ఏడ్చేదాని మొగుడొస్తే నా మొగుడు వస్తాడు.
171. ఏటి ఈతకు లంక మేతకు సరి.
172. యేటి ఒడ్డు  చేను.
173.. ఏడిచే బిడ్డకు అరటిపండు చూపించినట్లు.
174. ఏతి అంటే ప్రీతి అంటాడు.
175. ఏనుగు మింగిన ఎలగ పండు.
176. ఏనుగును చూసి కుక్కలు మొరిగినట్లు.
177. ఏపాటు తప్పినా సాపాటు తప్పదు.
178. ఏట్లో పారేనీరు ఎవరు తాగితేనేం.
179. ఏ పుట్టలో ఏ పాము ఉన్నదో.
180. ఏనుగంత తండ్రి ఉండటం కన్నా - ఏకంత తల్లి ఉండటం మేలు.
181. ఏరు దాటి తెప్ప తగలేసినట్లు.
182. ఏరు ఎన్ని వంకలు తిరిగినా చివరకు సముద్రంలో పడాల్సిందే.
183. ఏనుగు చచ్చినా బ్రతికినా వేయి వరహాలు.
184. ఏరు ముందా, ఏరువాక ముందా?
185. ఏలేవాడి  ఎద్దు పోతేనేం, కాసే వాడి కన్ను పోతేనేం.
186. ఐస్వర్యానికి అంతము లేదు.
187. ఐసా ఫయిసా.
188. ఐడియా ఉంటే అడవిలోనైనా బ్రతకొచ్చు.
189. ఒక దెబ్బకు రెండు పిట్టలు.
190. ఒక కన్ను కన్నూ కాదు ఒక కొడుకు కొడుకూ కాదు.
191. ఒకరిని ఇద్దరిని చంపితేగాని వైద్యుడు కాదు.
192. ఒక చెయ్యి తట్టితే చప్పుడు అవునా.
193. ఒక్కొకరాయి తీస్తూ ఉంటే కొండైనా కరుగుతుంది.
194. ఒక కాంచన తిని ఒక మంచాన పడుకునేవారు.
195. ఒక కంట సున్నం ఒక కంట వెన్న పెట్టుకున్నట్టు.
196. ఒక ఒరలో రెండు కత్తులు ఇమడవు.
197. ఒక చేతి వేళ్ళు ఒకటిగా లేవు.
198. ఒకణ్ణి చూస్తే పెట్టబుద్ధి ఇంకొకణ్ణి చూస్తే మొట్టబుద్ధి.
199. ఒళ్ళో గింజులున్నా, వద్ద భార్య వున్నా ఊరుకోబుద్ది కాదు.
200. ఒళ్ళో పెడుదునా దల్లో పెడుదునా అన్నట్టు.


18, నవంబర్ 2016, శుక్రవారం

Telugu Samaacharam

Telugu Talli

తెలుగు సామెతలు(PROVERBS)

1వ భాగం (100సామెతలు)

పది మంది జీవితానుభవాల సమీకరణమే సమెత, ఇవి నీతిని, హాస్యాన్ని, ఆనందాన్ని అందిస్తాయి. అభిప్రాయ వ్యక్తీకరణాన్ని వక్రగతి నుండి కాపాడ టానికి ఈ సామెతలు సహాయపడతాయి. 
           సామెతలు రచనకు, ప్రసంగానికి దీపాలు. సమయోచితంగా ఒక సామెతను ప్రయోగిస్తే పాలలో పంచదార కలిసినట్లే. సామెతలు చిన్న చిన్న వాక్యాలుగా ఉంటాయి. చెవికి ఇంపుగా ఉంటాయి. మన పూర్వుల అనుభవాన్ని తెలియజేసే అమృత గుళికలు సామెతలు. సూటిగా చెప్పాలనుకున్న విషయవివరణకు సహకరి సామెత.
1. కోటి విద్యలు కూటి కొరకే 
2. ఒక పూట తినేవాడు యోగి, రెండు పూటలా తినేవాడు భోగి, మూడు పూటలా తినేవాడు రోగి. 
3. పెండ్లి అయిన మొదటి ఆరు నెలలు భర్త మాట భార్య వింటుంది. తరువాతి ఆరు నెలలు భార్య మాట భర్త వింటాడు. ఆ తరువాత వారిద్దరి మాటలు ఇరుగు పొరుగు వారు వింటారు. 
4. వాస్తు అంటే పడగొట్టే శాస్త్రం - ఇంజనీరింగ్ అంటే కట్టే శాస్త్రం. 
5. మంత్రాలకు చింతకాయలు రాలునా ?.. అంత్రాలకు జబ్బులు తగ్గునా?
6. జలుబు చేస్తే మందులు వాడితే వారం రోజులలో తగ్గుతుంది. మందులు వాడకపోతే ఏడు రోజులలో తగ్గుతుంది. 
7. స్నేహితునికి డబ్బులు ఇస్తే రెండూ పోతాయి.
8. అమ్మను మించిన దైవము లేదు. 
9. అత్తా ఒకింటి కోడలే. 
10. అంగట్లో అన్నీ ఉన్నవి. అల్లుడి నోట్లో శని ఉన్నది. 
11. అడిగితేగాని అమ్మ ఐనా అన్నం పెట్టదు. 
12. అత్త చచ్చిన ఆరు నెలలకు కోడలు వచ్చింది. 
13. అమ్మ పుట్టిల్లు మేనమామ దగ్గరా. 
14. అమ్మ పెట్టాపెట్టదు, అడుక్కు తిననివ్వదు. 
15. అలివిగాని అలిని కట్టుకొని మురిగిచచ్చేరాముండాకొడుకు. 
16. అడ్డాలనాడు బిడ్డలుగాని, గడ్డాలనాడు బిడ్డలా. 
17. అబ్బ బావి తవ్విస్తే, అబ్బాయి పూడ్పించాడట. 
18. అంత్య నిష్ఠురం కన్నా అది నిష్టురమే మేలు. 
19.అలిగే బిడ్డతో చెలిగే గొడ్డుతో వేగడం కష్టం. 
20. అవ్వా కావలెను బువ్వా కావలెను. 
21. అమ్మ గృహ ప్రవేశము, ఆయ్య స్మశాన ప్రవేశము. 
22. అండలేని ఊళ్ళో ఉండదోషం. ఆశ లేని పుట్టింట  అడగదోషం. 
23. అడవి కాచిన వెన్నెల. 
24. అడ్డకత్తెరలో పోకచెక్కలాగా. 
25. అడిగేవాడికి చెప్పేవాడు లోకువ. 
26. అంధునికి అద్దము చూపినట్లు. 
27. అంబలి తాగే  వానికి మీసాలు ఎగబెట్టేవారు కొందరా. 
28. అమ్మబోతే అడవి - కొనబోతే కొరివి. 
29. అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినట్లు. 
30. అన్నము పెడితే తిరిగిపోతుంది. చీర ఇస్తే చిరిగిపోతుంది. వాత పెడితే కలకాలం ఉంటుంది. 
31. అప్పు ఇచ్చినవాడు బాగు కోరును. తీసుకున్నవాడు చెడు  కోరును. 
32. అగ్నికి వాయువు తోడైనట్లు. 
33. అగ్నిలో ఆజ్యం పోసినట్లు. 
34. అల్పుడికి ఐస్వర్యము వస్తే అర్ధరాత్రివేళ గొడుగుపట్టమన్నాడట. 
35. అడుసు త్రొక్కనేల కాలు కడగనేల. 
36. ఆయ్యవారిని చేయబోతే కోతి అయినది. 
37. అందని ద్రాక్షపండ్లు పుల్లన. 
38. అందని మామిడిపండ్లుకు ఆశ పడ్డట్టు. 
39. అన్నం ఉడికిందో లేదో అంతా పట్టి చూడనక్కర లేదు. 
40. అరచే కుక్క కరవదు. 
41. అందితే జుట్టు అందకపొతే కళ్ళు. 
42. అర్ధరాత్రివేళ అంకమ్మ శివాళ్ళు అన్నట్లు. 
43. అంతా తెలిసినవారు లేరు - ఏమి యెరుగనివారు లేరు. 
44. అవివేకితో స్నేహం కన్నా - విరోధితో విరోధం మేలు. 
45. అరువు సొమ్ము బరువు చేటు. 
46. ఆలికిన ఇంట ఒలికినా ఆనందమే. 
47. అరిటాకు వచ్చి ముళ్ళు మీద పడ్డా - ముళ్ళువచ్చి అరిటాకు మీదపడ్డా అరిటాకుకే నష్టం. 
48. అశుద్ధం మీద రాయి వేస్తే ముఖాన పడుతుంది. 
49. అందరికీ శకునము చెప్పే బల్లి కుడితి తొట్టిలో పడ్డట్టు. 
50. అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు. 
51. అన్నీ ఉన్న ఆకు అణిగిపది ఉంటుంది. ఏమీలేని ఆకు ఎగిరెగిరి పడుతుంది. 
52. అడిగోపులి అంటే ఇదిగో తోక అన్నట్లు. 
53. అట్టపెట్టే ఆరళ్ళే కనపడతాయిగాని, కోడళ్ళు చేసే కొంటె పనులు కనపడవు. 
54. అనగా అనగా రాగం తినగా తినగా రోగం. 
55. అన్నం తిన్న వాడు తన్నులు తిన్నవాడు మరచి పోడు. 
56. అర్జీల వల్ల పనులు కావు, ఆశీర్వాదాలు వల్ల బిడ్డలు పుట్టరు. 
57. అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్లు. 
58. అంతా మనమంచికే. 
59. అండలుంటే కొండలు దాటవచ్చు. 
60. అందరూ వైష్ణవులైతే బుట్టెడు రొయ్యలు ఏమైనట్లు. 
61. అచ్చుబోసిన ఆంబోతులాగా. 
62. అప్పుచేసి పప్పుకూడు. 
63. అయిపోయిన పెళ్ళికి మేళమెందుకు. 
64. అర్ధరాత్రి వేళ మద్దెల దరువు. 
65. అల్లుడికి బెట్టు ఇల్లాలికి గుట్టు ఉండాలి. 
66. అప్పులేనివాడు అధిక సంపన్నుడు. 
67. ఆలికి అన్నం పెట్టడం ఊరికి ఉపకారమా. 
68. ఆరోగ్యమే మహాభాగ్యం. 
69. అస్థికన్నా ఆరోగ్యం మిన్న.
70. ఆడలేక మద్దెల ఓడు అన్నట్లు. 
71. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా. 
72. ఆరు నెలలు స్నేహం చేస్తే వారు వీరవుతారు. 
73. ఆడబోయిన తీర్ధము యెదురుగా వచ్చింది. 
74. ఆలూలేదు చూలులేదు కొడుకు పేరు సోమలింగం. 
75. ఆకలి రుచి ఎరుగదు. నిద్ర సుఖం ఎరుగదు. వలపు సిగ్గు ఎరుగదు. 
76. ఆలుమగలు నందు పోట్లాట అద్దము మీద పెసరగింజ వేసినంత సేపు. 
77. ఆశపడి ఆరు లంఖణాలు చేస్తే ఆవేళా జొన్నకూడే . 
78. ఆడదిగా పుట్టేకంటే అడవిలో మానుగా పుట్టడం మేలు. 
79. ఆలు ఏడ్చిన ఇల్లు, ఎద్దు ఏడ్చిన సేద్యం ముందుకు రావట. 
80. ఆరు నెలలు చస్తాడనగా అసలు గుణం మారుతుందట. 
81. ఆయాసం ఒకరిది - అనుభవం మరొకరిది. 
82. ఆతండ్రి కొడుకు కూడా. 
83. ఆర్చేవారు లేరు తీర్చేవారు లేరు అడుగునబడితే లేవదీసేవారులేరు. 
84. ఆయుష్షు గట్టిదైతే అడవిలో ఉన్నా అయోధ్యలో ఉన్న ఒకటే. 
85. ఆఊరికి ఈఊరు యెంత దూరమో  ఈ ఊరికి ఆ ఊరు అంతే దూరం. 
86. ఆయుష్షు తీరినవాడు ఆరు నెలలకు చస్తే అనుమానం పడేవాడు అప్పుడే చచ్చాడంట. 
87. ఆరు నూరిన అదంటే. 
88. ఆరంభ సూరుడికి ఆర్భాటాలు ఎక్కువ. 
89. ఆవలిస్తే పేగులు లెక్కపెట్టినట్లు. 
90. ఆలస్యం చేస్తే అమృతం విషమౌతుందట. 
91. ఆరుద్ర వర్షం అమృతంతో సమానం. 
92. అడే కాలు పాడే నోరు ఊరకుండవట. 
93. ఆలు గుణవంతురాలైతే మేలు కలుగును. 
94. ఇంటికి దీపం ఇల్లాలే. 
95. ఇళ్లునుచూచి ఇల్లాలిని చూడమన్నారు. 
96. ఇల్లు చుస్తే తెలుస్తుంది ఇల్లాలి అందం. 
97. ఇల్లు ఇర్కటం ఆలు మర్కటం. 
98. ఇంట్లో పిల్లలు మంచంలో నల్లులు. 
99. ఇద్దరు పెళ్ళాల మొగుడు ఇరుకునపడి చచ్చినట్టు. 
100. ఇంటగెలిచి రచ్చ గెలవమన్నారు.